IND Vs NZ : Rohit Sharma To Skip Test, Ajinkya Rahane To Lead In First Test || Oneindia Telugu

2021-11-12 633

IND Vs NZ : Ajinkya Rahane is likely to lead India in the first of the two Tests against New Zealand later this month.
#INDVsNZ
#RohitSharma
#AjinkyaRahane
#ViratKohli
#BCCI
#KLRahul
#RahulDravid
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్ 2021లో దారుణ వైఫల్యం అనంతరం స్వదేశం చేరిన టీమిండియా.. మరో వారం వ్యవధిలోనే సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా కివీస్‌తోనే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడనుంది. అయితే టీ20 సిరీస్‌కు సంబంధించిన జట్టును చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మనే అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. టీ20 సిరీస్‌లో జట్టును నడిపించనున్న రోహిత్.. టెస్ట్ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోనున్నాడట. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వనున్నామని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.దాంతో వైస్ కెప్టెన్ అజింక్యా రహానేకు మార్గం సుగుమమైంది.